జనసేనని తొక్కేసిన బలమైన శక్తులు ఏంటీ ?
పార్టీని ఎదగనీయకుండా కొన్ని బలమైన శక్తులు పనిచేయడంతోనే వ్యతిరేక ఫలితాలు చూడాల్సి వచ్చిందన్నారు జనసేన అధినేత పవర్ కల్యాణ్. గురువారం మంగళగిరిలో ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన ఓటమికి గల కారణాలని విశ్లేషించారు. ఈ సందర్భంగా పవన్ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. పార్టీని ఎదగనీయకుండా కొన్ని బలమైన శక్తులు పనిచేశాయన్నారు. ఆ బలమైన శక్తులు ఏంటన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి పవన్ కల్యాణ్ నిజాయితీపై ఎవరికి అనుమానాల్లేవ్. ఆయన వస్తే కచ్చితంగా ఏపీ ప్రజలకి మంచి జరుగుతుందని ప్రజలు భావించారు. కానీ, ఎన్నికల్లో ఆయన్ని, ఆయన పార్టీ నేతలని గెలిపించలేదు. దీనికి కారణం జనసేన టీడీపీతో స్నేహం చేయడమే. ఎన్నికల ఫలితాలని చూస్తే.. తెదేపా ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత అసంతృప్తి ఉందన్నది అర్థమైంది. జనసేన కూడా తెదేపా మిత్రపక్షమని ప్రజలు గ్రహించారు. అందుకే ఆ పార్టీని అసలు లెక్కలోనికి కూడా తీసుకోలేదు. బహుశా.. తెదేపానే జనసేనని ఓడించిన బలమైన శక్తి అని పవన్ భావించి ఉంటారు. ఆ మాటని పవన్ బహిరంగంగా చెప్పకపోవడం గమనార్హం.