మన్మోహన్ సింగ్’కు సల్మాన్ ఫిదా
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫిదా అయ్యారు. ఆయన తన సూపర్ స్టార్ అంటున్నాడు. ఇప్పటికీ బాలీవుడ్ లో ఖాన్స్ త్రయందే హవా. రంజాన్ కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన సల్మాన్ ఖాన్ ‘భారత్’ చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకొంది. ఇందులో 1970 నుంచి నేటి వరకు భారతదేశం ఎదుర్కొన్న పరిణామాలని ప్రస్తావించారు.
భారత దేశం, భారత్ (సల్మాన్) కలిసి చేసిన ప్రయాణమే ఈ సినిమా కథ. స్వాతంత్య్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం.. ఇలా ప్రతి దశనూ దాటుకుంటూ, ప్రతి సవాల్‌నూ ఎదుర్కొంటూ, ప్రతి గాయాన్నీ తట్టుకుంటూ భారత్ ఎలా ఎదిగారన్నది ఈ సినిమాలో చూపించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న సల్మాన్ కి.. 90ల నాటి ఖాన్ త్రయం గురించి ప్రశ్న ఎదురైంది.
దానికి సమాధానిమిస్తూ.. 90ల కాలంలో ఇద్దరు సూపర్‌స్టార్ల ఎదుగుదల గురించి మాత్రమే అందరికి గుర్తుంది.
వారిలో ఒకరు బాద్‌షా షారుక్ ఖాన్ కాగా మరొకరు.. క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్. అయితే నా దృష్టిలో అసలైన సూపర్ స్టార్ వేరే ఉన్నారు. ఆయనే ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్. దేశం ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న రోజుల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని భారత ఆర్థిక వ్యవస్థను కష్టాల నుంచి విముక్తి చేసిన మన్మోహన్ సింగ్ నా దృష్టిలో నిజమైన సూపర్ స్టార్ అన్నారు సల్మాన్.