ఏపీ డిప్యూటీ సీఎంలు వీరే.. !

ఆంధ్రప్రదేష్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఏకంగా ఐదుగురిని డిప్యూటీ సీఎంలుగా అవకాశం ఇవ్వనున్నారు. మరో 20మందిని కేబినేట్ లోకి తీసుకోనున్నారు. మొత్తం 25మందితో ఏపీ కేబినేట్ కొలువుదీరనుంది. ఈ మేరకు ఈ ఉదయం జరిగిన వైఎస్సార్ సీపీ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం జగన్ వెల్లడించారు. అంతేకాదు.. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలోని 90శాతం మంత్రులని మారుస్తామని జగన్ చెప్పడం విశేషం. జగన్ నిర్ణయం పట్ల వైకాపా ఎమ్మెల్యేలు భాగోద్వేగానికి గురైనట్టు తెలిసింది.

ఇక, ఐదుగురు డిప్యూటీ సీఎంల పేర్లు కూడా బయటికొచ్చాయి. డిప్యూటీ సీఎం పదవుల రేసులో అంజాద్‌ బాషా(మైనార్టీ), సుచరిత(ఎస్సీ), ఆళ్ల నాని(కాపు), పార్థసారథి(యాదవ), రాజన్న దొర(ఎస్టీ)ను డిప్యూటీ సీఎంలుగా ఉన్నట్టు తెలుస్తోంది. మంత్రివర్గంలోకి తీసుకునే వారికి ఇప్పటికే వైకాపా అధిష్ఠానం నుంచి ఫోన్‌ ద్వారా సమాచారం అందుతోంది. ధర్మాన కృష్ణదాస్‌ (శ్రీకాకుళం), బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (కర్నూలు), బొత్స సత్యనారాయణ (విజయనగరం), పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (చిత్తూరు), మేకతోటి సుచరిత (గుంటూరు), మేకపాటి గౌతంరెడ్డి (నెల్లూరు), కొడాలి నాని (కృష్ణా జిల్లా), కొలుసు పార్థసారధి ( కృష్ణా జిల్లా) పేర్లు మంత్రులుగా ఖరారయ్యాయి. మిగితా వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.