జేడీయూ నుంచి ప్రశాంత్ కిషోర్ అవుట్ ?


ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌ ట్రాక్ రికార్డ్ తెలిసిందే. 2014లో మోదీ, 2015లో నీతీశ్‌ల గెలుపునకు ఆయన సహకారం అందించారు. ఏపీలో వైకాపా ఘన విజయంలో ప్రశాంత్ కిశోర్ వ్యూహాలు కీలక భూమిక పోషించాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఊహించని రీతిలో బెంగాల్‌‌లో భాజపా సీట్లు సాధించడంతో దీదీ అప్రమత్తమయ్యారు. ప్రశాంత్ కిషోర్‌‌తో ఆమె ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన జేడీయూ ప్రశాంత్‌కు ఉద్వాసన పలికేలా కనిపిస్తోంది.

‘ప్రశాంత్‌ మా పార్టీలో కార్యకర్తగా చేరారు. ఇప్పుడాయనకు కార్యకర్తగా పనిచేయడం ఇష్టం లేకపోతే మనమేం చేయగలం’ అన్నారు జేడీయూ అధికార ప్రతినిధి అజయ్‌ అలోక్‌. ప్రశాంత్‌ కిషోర్‌పై చర్యలు తీసుకోనున్నారా? అని అడిగితే.. అసలేం జరిగిందో మేం పూర్తిగా తెలుసుకోవాలి కదా అన్నారు. ఎవరికి వ్యూహకర్తగా పనిచేయాలనేది ప్రశాంత్ కిషోర్ వ్యక్తిగత విషయం. దాంతో పార్టీకి పనిలేదు. ఈ విషయాన్ని గతంలోలోనే బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కూడా చెప్పారు.

ఐతే, ప్రస్తుతం జేడీయూ ఎన్డీయే మిత్రపక్షంగా కొనసాగుతోంది. జేడీయూ నేతగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పశ్చిమ బెంగాల్ లో బీజేపీని ఓడించడానికి ప్లాన్ చేయబోతున్నారు. ఇదే జేడీయూకి ఇబ్బందిగా మారింది.