మమ్మల్ని చూస్తారు.. ఎంజాయ్ చేస్తారు.. కానీ !


‘నటీనటుల్ని చూడటానికి రూ.500 ఖర్చు చేసి థియేటర్‌కు వెళ్తారు. మమ్మల్ని నేరుగా చూడటానికి ఈవెంట్స్‌కు వస్తారు. కానీ, వారున్న సమాజంలో మేం జీవించేందుకు మాత్రం ఒప్పుకోరు’ అని ఆశ్చర్యం వ్యక్తం చేసింది హీరోయిన్ తాప్సీ. టాలీవుడ్ లో కెరీర్ ని ప్రారంభించిన తాప్సీ ప్రస్తుతం బాలీవుడ్ లో రాణిస్తోంది. ‘పింక్‌’, ‘బేబీ’, ‘నామ్‌ షబానా’ సినిమాలతో హిందీలో హిట్లు అందుకుని వరుస చిత్రాలతో బిజీగా ఉంది. ఐతే, హైదరాబాద్‌ నుంచి ముంబయికి షిఫ్ట్‌ అయిన కొత్తలో అనేక సమస్యల్ని ఎదుర్కొన్నానని తాప్సి తాజా ఇంటర్వ్యూలో తెలిపింది.

ముంబై తనకి ఓ అద్దె ఇల్లు దొరకడం కష్టమైంది. నేను ఒంటరిగా ఉండే నటిని కావడంతో ఎవరూ ఇల్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. ప్రజలకు నటన వృత్తిపై నమ్మకం లేకపోవడమే ఇందుకు కారమని తాప్సీ చెప్పుకొచ్చింది. ఇప్పుడు నాకంటూ ఓ ఇల్లు ఉంది. నా సోదరితో కలిసి సంతోషంగా ఉంటున్నా. నా తల్లిదండ్రులు ఇంకా దిల్లీలోనే ఉంటున్నారని తెలిపింది. తాప్సీ ప్రధాన పాత్రలో నటించిన ‘గేమ్‌ ఓవర్‌’ సినిమా ఈ నెల 14న విడుదల ప్రేక్షకుల ముందుకు రానుంది.