ఆకాశాన్ని చూసే అవ‌కాశం హైద‌రాబాద్ లో క‌లిగింద‌ట‌.

ఢిల్లీ కాలుష్యంపై ఇప్ప‌టికే చాలా చోట్ల వింటూనే ఉన్నాం. వాయు కాలుష్యంతో ప్ర‌మాదాలు జ‌రిగిన సంఘ‌ట‌న‌లు చూస్తూనే ఉన్నాం. సోష‌ల్ మీడియాలో కాలుష్యంపై సెటైరిక‌ల్ గా చాలా పోస్టింగులు కూడా వ‌స్తునే ఉన్నాయి. అయితే ఇప్పుడు అక్క‌డ ఆకాశాన్ని చూసే అవ‌కాశ‌మే లేదంటూ హైద‌రాబాద్ లో ఆ అవ‌కాశం క‌లిగిందంటూ సాక్షాత్తూ ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి కామెంట్స్ చేయ‌డం అక్క‌డి కాలుష్య తీవ్ర‌త‌కు అఅద్దం ప‌డుతోంది. ఆయ‌న చేసిన కామెంట్స్ విన‌డానికి సెటైరిక‌ల్ గా ఉన్నా ఇది ఢిల్లీలో ప్ర‌జ‌లు ఎలాంటి ప‌రిస్థితిని అనుభ‌విస్తున్నారో తెలియ‌జేస్తోంది.

వాయు కాలుష్యం ప‌రిధులు ధాటితే ప‌రిస్తితి ఎలా ఉంటుందో తెలుసుకోవ‌డానికి ఢిల్లీ లో ప్ర‌స్తుత ప‌రిణామాలే నిద‌ర్శ‌నం. ఏది చేసినా ముందే చేయాలి, ప్రారంభంలోనే జాగ్ర‌త్త‌లు తీసుకుంటే అన‌ర్ధాలు జ‌ర‌గ‌కుండా ఉంటాయి. జ‌ర‌గాల్సినదంతా జ‌రిగిన త‌రువాత చేసేదేముంటుంది. ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి సిసోడియా మాట‌ల్లో అంత‌రార్ధం ఇదేనేమో అనిపిస్తుంది. రోజురోజుకూ వాయు కాలుష్యం పెరిగిపోతున్న మ‌న హైద‌రాబాద్ లోనూ త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోతే ముందు ముందు మ‌నం కూడా ఆకాశం చూడటానికి ఇంకెక్క‌డికైనా వెళ్లాల్సి వ‌స్తుందేమో క‌దా..