షాక్ : ‘ఇస్మార్ట్ శంకర్’పై పోలీసులకి ఫిర్యాదు
‘ఇస్మార్ట్ శంకర్’కు పెద్ద కష్టమొచ్చింది. ఈ సినిమా స్క్రిప్ట్ మొత్తం లీకైంది. ఇన్స్టాగ్రామ్లో బజ్ బాస్కెట్ గ్రూప్లో ఈ చిత్రం స్క్రిప్ట్ ని చేసింది. తొలుత చిత్ర బృందం నేరుగా మురళీకృష్ణ వద్దకే వెళ్లి సంప్రదింపులు జరిపింది. ఐతే అతడు భారీ మొత్తంలో డబ్బు డిమాండ్ చేశాడట. అడిగిన డబ్బు ఇవ్వకపోతే స్క్రిప్ట్ మొత్తాన్ని అన్ని సామాజిక మాధ్యమాల వేదికల్లోనూ షేర్ చేస్తానని బెదిరించాడట. దీంతో చిత్ర సహ నిర్మాత ఛార్మి సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పూరి కసితో చేస్తున్న చిత్రమిది. ఇస్మార్ట్ శంకర్ మరో పోకిరి అని చెబుతున్నారు. పోకిరి తరహా ఇందులోనూ అదిరిపోయే ట్విస్ట్ ఉండనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రచార దృశ్యాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం విడుదలైన ఇస్మార్ట్ శంకర్ తొలి పాట ‘దిమాక్ ఖరాబ్..’ కిరాక్కుంది. ఈ నేపథ్యంలో సినిమా స్క్రిప్ట్ లీక్ కావడంపై చిత్రబృందం ఆందోళనలో ఉంది. మరీ.. ఈ కేసు ఏ మలుపు తిరిగుతుందన్నది చూడాలి.