తాప్సీని ఆ యాంగిల్’లో చూడటం లేదట.. !

టాలీవుడ్ లో తనని గ్లామర్ పాత్రలకి మాత్రమే వాడుకొన్నారని తెగ ఫీలైపోయింది.. సొట్టబుగ్గుల సుందరి తాప్సీ. ఇప్పుడు మాత్రం తనకి గ్లామర్ పాత్రలు రావడం లేదు. తాను లిప్ కిస్సులు పెడతా, అందాలు ఆరబోస్తానని చెప్పినా.. బాలీవుడ్ లో నమ్మడం లేదు. అసలు తనని ఆ యాంగిల్ లో చూడటం లేదని బాధపడుతోంది తాప్సీ. చాలా తక్కువ మంది నన్ను సంప్రదిస్తున్నారు.
నటించడానికి అవకాశం ఉన్న సినిమాలే నాకు వస్తున్నాయి. కమర్షియల్ సినిమాల కోసం నా దగ్గరకు ఎవరూ రావట్లేదు చెప్పింది.

బాలీవుడ్ లో అందంగా ఉండే అమ్మాయిలు చాలామందే ఉన్నారు. బాగా డాన్స్ కూడా చేస్తారు. కమర్షియల్ సినిమాలు చాలా చేస్తున్నారు. వారిందరినీ కాదని దర్శక-నిర్మాతలని తన దగ్గరికి రావడం లేదని చెప్పుకొచ్చింది తాప్సీ. ప్రస్తుతం తాప్సీకి బాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. దక్షిణాది నుంచి పెద్దగా ఆఫర్లు లేవు. ఐతే, చేతిలో ఉన్న రెండు మూడు మంచి ప్రాజెక్టులు ఉన్నాయని చెబుతోంది తాప్సీ. ఐతే, బాలీవుడ్ ప్రేక్షకులకి తనలోని గ్లామర్ యాంగిల్ ని చూపించలేకపోతున్నాననే బాధ మాత్రం తాప్సీలో కనబడుతోంది