చిరు చిన్నల్లుడుకి వేధింపులు
మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, హీరో కల్యాణ్ దేవ్ కు సైబర్ వేధింపులు ఎదుర్కొంటున్నారు. దీనిపై కల్యాణ్ దేవ్ బుధవారం సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. తనతో పాటు, తన కుటుంబాన్ని వేధిస్తున్నారు. సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు పెడుతున్నారు. ఓ పది అకౌంట్ల ద్వారా ఇలాంటి వేధింపులు ఎదురవుతున్నాయని కల్యాణ్ దేవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
కల్యాణ్ దేవ్ ఫిర్యాదుపై పోలీసులు చాలా స్వీడుగా స్పందించినట్టు తెలుస్తోంది. ఆ పది ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్ల డీటెయిల్స్ కోసం ఇన్‌స్ట్రాగ్రామ్‌కు లేఖ రాసినట్టు పోలీసులు చెప్పారు. ఆ వివరాలు అందగానే ఆకతాయిలపై చర్యలు తీసుకొంటామని అదనపు డీసీపీ రఘువీర్ పేర్కొన్నారు. ఇక, సినిమాల విషయానిస్తే.. విజేత సినిమాతో కళ్యాణ్ దేవ్ హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన రెండో సినిమా షూటింగ్ జరుపుకుంటోంది.