జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పొడిగింపు
జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్లో జులై 3 నుంచి మరో 6 నెలల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగనుందని
కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్ మీడియాకు తెలిపారు.
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో అంతర్జాతీయ సరిహద్దు గ్రామాల ప్రజలకు లబ్ధి చేకూరనుంది. విద్య, ఉద్యోగం, పదోన్నతుల్లో సరిహద్దు ప్రజలకు రిజర్వేషన్లు వర్తించనున్నాయి. కేంద్రీయ విద్యాసంస్థల బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్రీయ విద్యా సంస్థల్లో 7వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేసేందుకు కేబినేట్ ఆమోదించింది.
ఇక, త్వరలో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు.