హృతిక్ సోదరి ఆవేదన

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ హృతిక్‌ రోషన్‌ సోదరి సునైనా సంసార జీవితం సాఫీగా సాగడం లేదట. ఈ విషయాన్ని స్వయంగా సునైనానే తెలిపింది. ‘నాకు నా కుటుంబమే ఓ నరకంలా ఉంది. నన్ను ఎవ్వరూ సరిగ్గా చూసుకోవడంలేదు. ఎలా ఉన్నానని కూడా అడిగింది లేదు. ఇంతకుమించి నా కుటుంబం గురించి ఏమీ చెప్పలేను’నని ఆవేదన వ్యక్తం చేసింది సునైనా.

ప్రస్తుతం సునైనా తల్లిదండ్రుల ఇంట్లోనే ఉంటోంది. అలాగని వాళ్లతో కలిసి కాదు. ఇంట్లోనే సపరేటు గది ఒకటి ఏర్పాటు చేసుకొంది. గది నుంచి నేరుగా బయటికి వెళ్లడానికి గేటు కూడా ఏర్పాటు చేసుకొంది. ఆమెకు అత్త, అమ్మగారి ఇంట్లో వారి నుంచి ఎలాంటి సపోర్టు లభించడం లేదని తెలుస్తోంది. ఇక, కొంతకాలంగా సునైనా అనారోగ్యంతో బాధపడుతున్నారని, పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అవన్నీ తప్పుడు ప్రచారమని సునైనా క్లారిటీ ఇచ్చింది.