టీమ్‌ఇండియానే ఫేవరెట్‌


న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది టీమ్‌ఇండియా. ఈ మ్యాచ్ లో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌. కొన్ని నెలల కిందట న్యూజిలాండ్‌ను దాని సొంతగడ్డపై వన్డేల్లో మట్టికరిపించింది కోహ్లీసేన. 4-1తో సిరీస్‌ను చేజిక్కించుకొంది. తాజా వరల్డ్ కప్ లోనూ వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లను ఓడించడం భారత్‌ ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే. కివీస్‌.. వరుసగా మూడు విజయాలు సాధించింది. ఐతే ఆ జట్టు ఓడించింది తన కంటే బలహీనమైన శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌లను. ఈ నేపథ్యంలో టీమ్‌ఇండియానే ఫేవరెట్‌ గా బరిలోకి దిగనుంది.

ఇక, ధావన్‌ స్థానంలో రోహిత్‌తో కలిసి కేఎల్‌ రాహుల్‌ ఓపెనింగ్‌ చేయబోతున్నాడు. నం.4లో స్థానం కోసం దినేష్ కార్తీక్, విజయ్ శంకర్ పోటీ పడుతున్నారు. వీరిద్దరిని ఆడించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఫాస్ట్ పిచ్ కాబట్టి.. ఒక స్పిన్నర్ తో మాత్రమే బరిలోకి దిగనున్నారు. జాదవ్ ని పక్కనపెట్టి దినేష్, విజయ్ శంకర్ ఇద్దరినీ ఆడించే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అలా చేస్తే టీమిండియా బ్యాటింగ్ ఇంకా బలంగా మారనుంది.