పెళ్లికానీ ప్రసాద్.. మన్మథుడుగా మారితే.. !!

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు2’. రకుల్ ప్రీత్ సింగ్ కథానాయిక. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల అయింది. ఇందులో నాగ్ మొదట్లో పెళ్లికానీ ప్రసాదుగా వినోదం పంచాడు. ఆ తర్వాత మన్మథుడుగా మారాడు. ఓ రేంజ్ లో రొమాన్స్ చేయడం చూడొచ్చు. రెండో మన్మథుడు రెండు షేడ్స్ లో కనిపించబోతున్నాడు అన్నమాట. ‘పెళ్లికానీ ప్రసాద్.. మన్మథుడు’గా మారడమే మన్మథుడు2 లైన్ లా కనిపిస్తోంది.

ఇక టీజర్ లో డైలాగ్స్, రొమాన్స్ హైలైట్ గా నిలిచాయి. ‘నీకు షెటర్లు మూసేసి.. దుకాణం సర్థేసే సమయం వచ్చేసింది’, ‘ఈ వయసులో మీకు పెళ్లేంటీ సార్.. ఎండిపోయిన చెట్టుకి నీళ్లు పోస్తే మళ్లీ పూలు పూస్తాయా ?’, పిల్లలకి కోచింగ్ ఇవ్వాల్సిన టైంలో నీవ్ బ్యాటింగ్ కు దిగుతున్నావ్ ఏంట్రా ?’ డైలాగ్స్ బాగా పేలాయ్. చివర్లో ‘నేను ప్రేమలో పడను. ప్రేమని పుట్టాస్తాను’ అని నాగ్ చెప్పడం ఆకట్టుకొంది. మొత్తంగా రెండో మన్మథుడు ఎంటర్ టైనింగ్ గా కనిపిస్తున్నాడు.