తమన్నా.. రెండు తీరని కోరికలు !

మిల్కీ బ్యూటీ తమన్నాకు రెండు కోరికలు ఉన్నాయట. ఇందులో ఒకటి డ్యాన్స్ బేసిడ్ సినిమాలో నటించాలని. తమ్మూ మంచి డ్యాన్సర్ అన్న సంగతి తెలిసిందే. ఐతే, డ్యాన్స్ బేసిడ్ స్క్రిప్టులు మాత్రం రావడం లేదట. తమన్నా రెండో కోరిక బయోపిక్ లో నటించాలి. అది కూడా అతిలోక సుందరి శ్రీదేవి బయోపిక్ లో నటించాలని. శ్రీదేవి అంటే తమన్నాకు ఇష్టం. కాదు ప్రాణం.

ఆమె పాత్రలో జీవించేయాలన్నది తమ్మూ కోరిక. తనకు శ్రీదేవి అంటే చాలా ఇష్టం. ఎప్పటికైనా ఆమె బయోపిక్ చేయాలని ఉందని మనసులో మాటను బయటపెట్టింది తమ్మూ. మరీ.. ఆమె కోరికలు ఎప్పటికి నెరవేరుతాయో చూడాలి. ఆ మధ్య శ్రీదేవి బయోపిక్ పై వార్తలొచ్చాయ్. బోనీ కపూర్ ఆ పనిలోనే ఉన్నారనే చెప్పుకొన్నారు. ఐతే, శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ పేరు వినిపించింది. తమ్మూ కోరిక తీరాలంటే తన కోరికని ఆమె బోనీ కపూర్ ముందు ఉంచితే మంచిదేమో… !