మాజీ గర్ల్ ఫ్రెండ్స్ పై షాహిద్ షాకింగ్ కామెంట్స్
ఒకప్పుడు బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ రేంజ్ యే వేరుగా ఉండేది. స్టార్ హీరోయిన్స్ తో డేటింగ్ చేశాడు. కరీనా కపూర్-షాహిద్ కపూర్ ల లవ్ ఏపీసోడ్ బాలీవుడ్ లో ఎప్పటికీ నిలిచిపోయేదే. గ్లోబల్ స్టార్ గా మారిన ప్రియాంక చోప్రాతో అప్పట్లో షాహిద్ కపూర్ డేటింగ్ చేశారు. ఐతే, ఆ తర్వాత వీరిద్దరికి షాహిద్ దూరమయ్యాడు. మీరా రాజ్ పుత్ ని పెళ్లి చేసుకొన్నాడు. పెళ్లి తర్వాత షాహిద్ మాత్రం షాహిద్ పద్దతిగా ఉంటున్నాడు. సంసార జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ఆయన నటించిన తాజా చిత్రం ‘కబీర్ సింగ్’. టాలీవుడ్ హిట్ ‘అర్జున్ రెడ్డి’కి రిమేక్ ఇది. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నేహాధూపియా హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిఎఫ్ఎఫ్ విత్ వోగ్ షోలో పాల్గొన్నాడు. మాజీ గర్ల్ ఫ్రెండ్ కరీనా కపూర్ పెళ్లికి ఎందుకు హాజరుకాలేదు ? అని నేహా ధూపియా షాహిద్ ని ప్రశ్నించింది. దీనికి షాహిద్ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఆమె నన్ను పెళ్ళికి పిలవలేదు. అసలు కరీనా జరుగుతున్న సంగతి కూడా తనకి తెలీదు అన్నారు. మరో మాజీ గర్ల్ ఫ్రెండ్ ప్రియాంక చోప్రా వివాహానికి మాత్రం షాహిద్ కపూర్ హాజరయ్యాడు.