ముగ్గురు మాస్ దర్శకులతో బాలయ్య సినిమా
బాలయ్య ఎవ్వరినీ నిరాశపరచడం లేదు. వరుసగా ముగ్గురు మాస్ దర్శకులు కె.యస్ రవికుమార్, బోయపాటి శ్రీను, వివి వినాయక్ లతో సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసుకొన్నట్టు తెలుస్తోంది. బాలయ్య 152 చిత్రం బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. ఐతే, సడెన్ గా కె.యస్ రవికుమార్ తెరపైకి వచ్చారు. బాలయ్యతో కథని ఓకే చేయించుకొన్నారు. సినిమా ప్రారంభోత్సవానికి కూడా ఏర్పాట్లు చేసుకొన్నారు. ఇంతలో సినిమా క్యాన్సిల్ అయిందనే ప్రచారం జరిగింది. ఆ రూమర్స్ అన్నింటికీ చెక్ పెడుతూ గురువారం కెయస్ రవికుమార్ సినిమాని ప్రారంభించారు. అంతేకాదు.. ఈ సినిమా లాంచ్ కు దర్శకులు బోయపాటి, వినాయక్ కూడా వచ్చారు.
ఈ నేపథ్యంలో బోయపాటి, వినాయక్ లతోనూ బాలయ్య సినిమా ఉండబోతుందనే సంకేతాలు ఇచ్చినట్టయింది. ఈ ముగ్గురు మాస్ దర్శకులు కూడా ప్రస్తుతం ప్లాపుల్లో ఉండటం బాలయ్య అభిమానులని కలవరపెడుతోంది. ‘జై సింహా’ సినిమా బాలయ్య అభిమానులకి కూడా నచ్చలేడు. అయినా.. మళ్లీ ఆయనకే ఛాన్స్ ఇచ్చాడు బాలయ్య. ‘వినయ విధేయ రామ’తో బోయపాటి ప్రేక్షకులని భయపెట్టారు. ఆయనతో సినిమా వద్దే వద్దని అభిమానులు అనే పరిస్థితి. ఇక, వినాయక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూస్తుంటే.. ఈ ముగ్గురు ప్లాపు దర్శకులని తిరిగి ఫామ్ లోకి తీసుకొచ్చే బాధ్యతని బాలయ్య తీసుకొన్నట్టున్నాడు.