పోలవరం ఖర్చు.. రూ.5వేల కోట్లు వెనక్కి రప్పిస్తున్న జగన్
ఏపీ నూతన సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత పోలవరంపై ప్రత్యేకంగా దృష్టిసారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రం పెట్టిన ఖర్చు మొత్తాన్ని కేంద్రం నుంచి రాబట్టేందుకు చర్యలు చేపట్టాలని ఇటీవల జరిగిన అధికారుల సమీక్షలో ఆదేశించారు. పోలవరంపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.5వేల కోట్లు ఖర్చుచేసింది.
ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని పోలవరంపై పెట్టిన ఖర్చులను వెనక్కి ఇవ్వాలంటూ రాష్ట్ర అధికారులు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని పరిశీలించిన కేంద్ర జలవనరుల శాఖ అధికారులు.. ఆర్థిక శాఖ అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు. కేంద్ర ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శి ఆమోదం తర్వాతే నిధులు విడుదలకు అవకాశం ఉన్నట్టు సమాచారమ్.