‘సాహో’ టీజర్ ట్రెడింగ్ నెం.1
సాహో సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నది టీజర్ తో తేలిపోయింది. సాహో టీజర్ గురువారం ఉదయం విడుదలైంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే రికార్డు వ్యూస్, లైకులు సొంతం చేసుకొంది. టీజర్ విడుదలైన ఆరు గంటల్లోనే 25 మిలియన్ల డిజిటల్ వ్యూస్(అన్ని భాషల్లో) సంపాదించింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ‘సాహో’ కోసం అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో చెప్పడానికి. ప్రస్తుతం ‘సాహో’ టీజర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ నెం.1గా ఉంది.
ఈ విషయాన్ని తెలుపుతూ యూవీ క్రియేషన్స్ ట్విట్ చేసింది. సాహో టీజర్ కు వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేసింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. శ్రద్ధాకపూర్ కథానాయిక. టీజర్‌ను చూసిన వారందరూ ‘అద్భుతం’ అంటూ మెచ్చుకుంటున్నారు. దర్శకధీరుడు రాజమౌళితో పాటు టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా సాహో టీజర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. యాక్షన్ అదిరిందని కితాబిస్తున్నారు.
The year’s biggest action entertainer is rocking the Internet & how! #SaahoTeaser now trending at #1 on @YouTubeIndia ! 👊
Watch it here : https://t.co/JlDpuvYIZj#Prabhas @ShraddhaKapoor @NeilNMukesh @sujeethsign @itsBhushanKumar @UV_Creations @TSeries pic.twitter.com/CPj0R51yLo
— UV Creations (@UV_Creations) June 13, 2019