నామాపై నమ్మకం ఉంచారు
గతంలో తెరాస లోక్‌సభాపక్ష నేతగా జితేందర్ రెడ్డి, ఉప నేతగా వినోద్ వ్యవహరించారు. వారిద్దరూ ఈసారి లేకపోవడంతో కొత్తవారిని నియమించారు సీఎం కేసీఆర్. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెరాస పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తెరాస పార్లమెంటరీ, రాజ్యసభా పక్ష నేతగా కె.కేశవరావు, లోక్‌సభా పక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును నియమిస్తూ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
రాజ్యసభా పక్ష నేతగా కె.కేశవరావు కొనసాగించాలని ముందే నిర్ణయం తీసుకొన్నారు. తెరాస లోక్ సభ పక్ష నేతగా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్ది పేరు కూడా వినిపించింది. ఆయనకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరిగింది. ఐతే, సామాజిక సమీకరణాలు, అనుభవం, విధేయతను దృష్టిలో ఉంచుకొని నామా నాగేశ్వరరావుకు అవకాశం ఇచ్చారు. కొత్త ప్రభాకర్ రెడ్ది మాజీ మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడు కావడం కూడా మైనస్ అయిందని టాక్. ఎందుకంటే ? తెరాసలో హరీష్ రావుపై బ్యాన్ నడిస్తుందని గుసగుసలు వినిపిస్తునాయ్.