సీనియర్ హీరోకు అద్దె భార్యగా రకుల్.. !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోతో రొమాన్స్ చేస్తోంది. అది కూడా అద్దె భార్యగా పేమెంట్ తీసుకొంటున్నట్టు తెలుస్తోంది. నాగార్జున-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘మన్మథుడు2’. రాహుల్ రవీంద్రన్ దర్శకుడు. సమంత, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ గురువారం విడుదలైంది. ఇందులో నాగ్ పెళ్లికానీ ప్రసాదుగా, సీక్రెట్ గా రొమాన్స్ చేసే మన్మథుడుగా ఆకట్టుకొన్నాడు. టీజర్ లో రకుల్ కనిపించలేదు. మొహం కనిపించకుండా నాగ్ తో రొమాన్స్ చేసిన అమ్మాయి రకుల్ లా అనిపించింది. కానీ రకుల్ కాదు. టీజర్ లో రకుల్ లేదు. ఐతే, రకుల్ పాత్ర గురించి ఆసక్తికర విషయం తెలిసింది.

2006 లో వచ్చిన ఫ్రెంచ్ సినిమా ‘ఐ డూ’ ఆధారంగా మన్మధుడు 2 తయారవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే.. ‘ఐ డూ’ సినిమాలో అద్దె భార్య పాత్ర ఒకటి వుంటుంది. అదే రకుల్ ప్రీత్ సింగ్ పోషిస్తున్నట్లు అనుకోవాలి. పక్కా తెలుగు కథ మాదిరిగానే ‘ఐ డూ’ సినిమా వుంటుంది. అది నాగ్ కు సూట్ అవుతుంది. కాకపోతే.. ఇలాంటి లైన్ లో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయ్. వినోదాత్మకంగా డీల్ చేస్తే ‘మన్మథుడు2’కు విజయం సాధించే ఛాన్స్ ఉంది. టీజర్ తోనే నవ్వించేశారు. సినిమాలో ఇంకేరేంజ్ లో నవ్విస్తారన్నది చూడాలి. ఆగస్టు 9న మన్మథుడు2 ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.