ఏపీ సీఎం బడిబాట

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్ది బడిబాట పట్టారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన రాజన్న బడిబాట కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. సీఎం చేతుల మీదుగా చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. పిల్లలను బడికి పంపించే తల్లులకు జనవరి 26న రూ.15వేలు సాయం అందిస్తామన్నారు.

‘‘చిన్నారులు బడికి వెళ్లాలి.. పెద్ద పెద్ద చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలి. పిల్లల్ని చదివించేందుకు వారి తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదు. నా సుదీర్ఘ పాదయాత్రలో.. పిల్లల చదువుకోసం తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు చూశా. ఈ వ్యవస్థలో సంపూర్ణమైన మార్పు తీసుకొస్తానని ఆరోజే చెప్పా. మీ పిల్లల చదువును నేను చూసుకుంటానని మాటిచ్చా. ఆ మాట నిలబెట్టుకునే రోజు ఇవాళ వచ్చినందుకు సంతోషంగా ఉంది” అన్నారు జగన్