ఆ హీరోయిన్’ని హేళన చేసిన హీరో తండ్రి !

సినీ ఇండస్ట్రీలో చీకటి కోణంపై జోరుగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో తమిళ్ హీరో శింబు తండ్రి తనని హేళన చేశాడని హీరోయిన్ ధన్సిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. దీనికి కారణం మీడియా సమావేశంలో ఆయన పేరు ప్రస్తావించకపోవడమేనట. శంబు తండ్రి టి. రాజేందర్ చేసిన హేళనకి తాను వారం రోజుల పాటు నిద్రపోలేదని ధన్సిక ఆవేధన వ్యక్తం చేస్తోంది.

ఇటీవలే ఓ సినిమా ప్రమోషన్ పాల్గొన్న ధన్సిక.. ఆ చిత్ర నిర్మాత టి. రాజేందర్ పేరుని ప్రస్తావించడం మరిచిపోయింది. దీంతో ప్రెస్ మీట్ పూర్తయిన తర్వాత ఆయన ధన్సికకు ఓ రేంజ్ లో క్లాస్ పీకాడట. రజనీ సినిమాలో చేయగానే స్టార్ హీరోయిన్ అయిపోయావు. నేనెలా కనిపిస్తానులే.. అంటూ హేళనగా చేశాడట. ఆయన మాటలకు తనకు వారం రోజుల పాటు నిద్రపట్టలేదు. ఆయన మంచివాడని, ఆధ్యాత్మిక చింతన గల వాడని విన్నాడు. కానీ, ఆయనలో నాకు ఆ లక్షణాలు ఎప్పుడు కనిపించలేదని చెప్పుకొచ్చింది.