హ్యాపీ బర్త్ డే ‘లిటిల్ టైగర్’


యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ మొదటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తారక్‌.. భార్గవ్‌ను ఎత్తకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు, పెద్ద కుమారుడు అభయ్‌ తన తమ్ముడి పక్కన కూర్చున్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ‘భార్గవ్‌ తొలి పుట్టినరోజు’ అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇప్పుడీ ఫోటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భార్గవ్‌ను ‘లిటిల్‌ టైగర్‌’ అని సంబోధిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు నెటిజన్స్.

ప్రస్తుతం ఎన్టీఆర్‌ ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో తారక్ కొమరంభీమ్ గా నటిస్తున్నారు. ఆయనకి జోడిగా జతకట్టే హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ కూడా నటిస్తున్నారు. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఆయనకి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని దాదాపు రూ. 400కోట్లకుపైగా బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 2020 జులై 30న ఆర్ ఆర్ ఆర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.