రివ్యూ : వజ్ర కవచధర గోవింద
చిత్రం : వజ్ర కవచధర గోవింద (2019)
నటీనటులు : సప్తగిరి, వైభవి జోషి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సంగీతం : బుల్గానియన్
దర్శకత్వం : అరుణ్ పవర్
నిర్మాత : నరేంద్ర, జీవిఎన్ రెడ్డి
రిలీజ్ డేటు : 14జూన్, 2019
రేటింగ్ : 2.5/5
కమెడియన్ గా కొనసాగుతూనే హీరోగానూ సినిమాలు చేస్తున్నాడు సప్తగిరి. సప్తగిరి హీరోగా ఇప్పటికే ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’, సప్తగిరి ఎల్ ఎల్ బీ సినిమాలొచ్చాయ్. ఓ మోస్తరుగా ఆడాయి. ఆయన తాజా చిత్రం ‘వజ్ర కవచధర గోవింద’. ఈ చిత్రానికి అరుణ్ పవర్ దర్శకత్వంలో వహించారు. వైభవి జోషి హీరోయిన్. శివ శివం ఫిల్మ్స్ బ్యానర్ పై నరేంద్ర, జీవిఎన్ రెడ్డి నిర్మించారు. టీజర్, ట్రైలర్ లతో ఆకట్టుకొన్న ‘వజ్ర కవచధార గోవింద’ ఈరోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ.. హీరోగా సప్తగిరి ఈసారైనా సక్సెస్ అయ్యాడా ? తెలుసుకొనేందుకు రివ్యూలోకి వెళదాం పదండీ.. !
కథ :
సొంతూరు బాగుండాలని కోరుకొనే కుర్రాడు సప్తగిరి (గోవింద). ఊరు జనం వరుసగా క్యాన్సర్ తో చనిపోతుండటం జీర్ణించుకోలేకపోతాడు. ఊరి జనాన్ని కాపాడేందుకు ‘ఎమ్ఎల్ఏ’ లక్ష్మి ప్రసన్న (అర్చన శాస్త్రీ) నమ్మీ.. దారుణంగా మోసపోతాడు. ఐతే ఊరి జనాలని కాపాడుకొనేందుకు ‘నిధి’ రూపంలో గోవిందకు మరో అవకాశం దక్కుతుంది. ఇంతకీ గోవిందకు నిధి దొరికిందా ? దాంతో ఊరి ప్రజల కష్టాలని తీర్చాడా ?? ఈ క్రమంలో గోవింద ఎదుర్కొన్న కష్టాలు ఏంటీ ? అన్నది మిగితా కథ.
ప్లస్ పాయింట్స్ :
* సప్తగిరి నటన
* వినోదం (అక్కడక్కడ)
మైనస్ పాయింట్స్ :
* కథ-కథనం
* లాజిక్ లేని సన్నివేశాలు
* స్లో నేరేషన్
* యాక్షన్ సీన్స్, అనవసర బిల్డప్ లు
నటీనటుల ఫర్ ఫామెన్స్ :
దర్శకుడు అరుణ్ పవర్ సప్తగిరిని మాత్రమే నమ్ముకొన్నాడు. సప్తగిరి మార్క్ కామెడీని పండించే ప్రయత్నం చేశాడు. ఇందు కోసం ఆయన గతం మరిచిపోయే సన్నివేశాలు పెట్టారు. దీంతో సప్తగిరి చేసే కామెడీకి హద్దులు లేకుండ చేశాడు. గుహాలోకి సప్తగిరి వెళ్లే సన్నివేశాల్లో కామెడీ హైలైట్ గా నిలిచింది. క్యాన్సర్ తో చిన్నారి చనిపోయిన సన్నివేశం ఎమోషనల్ గా టచ్ చేసింది. ఐతే, సప్తగిరితో కామెడీతో పాటు యాక్షన్ చేపించాడు. అది ఓవర్ గా అనిపిస్తుంది. సప్తగిరి చేసే కామెడీ మాత్రమే ప్రేక్షకులు ఎంజాయ్ చేసేలా ఉంది. యాక్షన్ ని బోర్ కొట్టించిందే. హీరోయిన్ గా నటించిన ‘వైభవి జోషి’ అందం, అభినయంతో ఆకట్టుకొంది.
విలన్ బంగారయ్య పాత్రలో నటించిన నటుడు ఆకట్టుకొన్నాడు. ఆయన ఆహార్యం విలనీజానికి సరిగ్గా సరిపోయింది. చివర్లో శ్రీనివాస్ రెడ్డి, వేణు, మిగిలిన కమెడియన్స్ నవ్వించే ప్రయత్నాలు చేశారు. అందులో కొద్దిగా సక్సెస్ అయ్యారు కూడా. మిగితా నటీనటులకి పెద్దగా నటించే స్కోప్ లేదు. ఈ సినిమా ద్వారా సప్తగిరి కామెడీతో యాక్షన్ కూడా చేస్తాడని చూపించే ప్రయత్నం జరిగింది.
సాంకేతికంగా :
దర్శకుడు కథ-కథనం బలంగా రాసుకోలేదు. అక్కడక్కడ అరుపులు, మెరుపులు మాత్రమే కనిపిస్తాయి. ఇక, టెక్నికల్ కూడా సినిమా అంత గొప్పగా ఏమీ లేదు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. బుల్గానియన్ అందించిన పాటల్లో ఓ పాట బాగుంది. నేపథ్య సంగీతం బాగుంది. సినిమాలో బోరింగ్ సన్నివేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని సీన్స్ కి కత్తెరపెట్టొచ్చు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
రేటింగ్ : 2.5/5