ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి నిలదీసిన గుణశేఖర్ !
దర్శకుడు గుణశేఖర్ ఏపీ ప్రభుత్వాన్ని మరోసారి నిలదీశారు. ఏపీ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల్లో గుణశేఖర్ ‘రుద్రమదేవి” చిత్రానికి ఏ ఒక్క కేటగిరీలో అవార్డు దక్కలేదు. దీనిపై గుణశేఖర్ ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రశ్నించడం తప్పా? అంటూ పలు ప్రశ్నలు సంధించారు.
గతంలో ‘రుద్రమదేవి’ సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు కూడా ఇవ్వలేదు. అదే బాలకృష్ణ “గౌతమీపుత్ర శాతకర్ణి” సినిమాకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు పన్ను మిహానాయింపుని ఇచ్చాయి. ‘రుద్రమదేవి’ సినిమాకు తెలంగాణ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చినా.. ఏపీ ప్రభుత్వం మాత్రం ఇవ్వలేదు. దీనిపై అప్పట్లో ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు దర్శకుడు గుణశేఖరు.
ఇప్పుడు మరోసారి ‘రుద్రమదేవి’ సినిమాకు ఏపీ ప్రభుత్వం అన్నాయం చేసింది. మహిళా సాధికారతను చాటి చెబుతూ తీసిన ‘రుద్రమదేవి’కి నంది అవార్డుని ప్రకటించలేదు. దీనిపై తెలంగాణ ప్రజలు కూడా మండిపడుతున్నారు. ఇది తెలంగాణకు జరిగిన అన్యాయంగా సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ వినబడుతున్నాయి.