నాగశౌర్యకు తీవ్ర గాయాలు


టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య షూటింగ్ లో తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఆయన కాలుకి తీవ్రగాయమైంది. ప్రస్తుతం తన స్వంత బ్యానర్ మీద విశాఖలో సినిమా షూట్ లో వున్నాడు నాగశౌర్య. ఐరా క్రియేషన్స్ బ్యానర్ మీద ఛలో, నర్తనశాల తరువాత ఈ సినిమా తీస్తున్నారు.ఈ చిత్రానికి కొత్త దర్శకుడు పని చేస్తున్నాడు. ‘అశ్వద్ధామ’ టైటిల్ ఫిక్స్ చేసారు.
కేజిఎఫ్ లాంటి సినిమాకు పని చేసిన ఫైట్ మాస్టర్ అన్ భైరవ్ ఆధ్వర్యంలో ఫైట్ సీన్లు తీస్తున్నారు. డూప్ లు లేకుండా, రోప్ లు లేకుండా బిల్డింగ్ ల మీద నుంచి జంప్ ల లాంటి షాట్ లు తీస్తుండగా, మోకాలికి గట్టి గాయం తగిలింది. 15 అడుగుల పై నుంచి దూకినపుడు మోకాలి దగ్గర డిస్ లోకేషన్ వచ్చినట్లు తెలుస్తోంది.

వెంటనే హాస్పిటల్ కు తీసుకెళ్లడం, ట్రీట్ మెంట్ చేసి, నాలుగు వారాలు రెస్ట్ అవసరం అని చెప్పడంతో నాగశౌర్య హైదరాబాద్’కు తీసుకొచ్చారు. కాలికి గాయంతో విమానాశ్రయానికి వచ్చిన నాగశౌర్య ఫోటోలు బయటికొచ్చాయ్. ఇక, సమంత ప్రధాన పాత్రలో నటించిన ఓ బేబీ సినిమాలో నాగశౌర్య కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా జులై5న ప్రేక్షకుల ముందుకు రానుంది.