భారత్ : ‘స్లో మోషన్.. ‘ ఫుల్ వీడియో సాంగ్

అలీ అబ్బాస్‌ దర్శకత్వంలో సల్మాన్‌ ఖాన్‌, కత్రినా కైఫ్‌, టబు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భారత్’. రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘భారత్’ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.100కోట్లు కలెక్ట్ చేసింది. సల్మాన్ బ్లాక్ బస్టర్ హిట్ లిస్టులో భారత్ చేరింది. తాజాగా ఈ సినిమాలోని హిట్ సాంగ్ స్లో మోషన్ ఫుల్ వీడియోని విడుదల చేసింది. సల్మాన్ ఖాన్, దిశాపటానీ లపై చిత్రీకరించిన ఈ సాంగ్ ని థియేటర్స్ లో ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు ఆ సాంగ్ ని మీరు చూసేయండీ..!

భారత దేశం, భారత్‌ (సల్మాన్‌) కలిసి చేసిన ప్రయాణమే ఈ సినిమా కథ. స్వాతంత్య్రం, దేశ విభజన, నిరుద్యోగం, ఎమర్జెన్సీ, ఆర్థిక మాంద్యం.. ఇలా ప్రతి దశనూ దాటుకుంటూ, ప్రతి సవాల్‌నూ ఎదుర్కొంటూ, ప్రతి గాయాన్నీ తట్టుకుంటూ భారత్‌ ఎలా ఎదిగారన్నది ఈ సినిమాలో చక్కగా చూపించారు. కథని వినోదాత్మకంగా చెబుతూనే ఎమోషన్స్ ని టచ్ చేశాడు దర్శకుడు అలీ అబ్బాస్.