షూటింగ్’లో సందీప్ కిషన్ కు తీవ్ర గాయాలు

టాలీవుడ్ యంగ్ హీరోలు వరుసగా గాయాలపాలవుతున్నారు. ఇటీవలే మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాని గాయపడ్డారు. శుక్రవారం నాగశౌర్య గాయపడ్డారు. ఆయన కాలికి గాయమైంది. దీంతో విశాఖ షూటింగ్ షెడ్యూల్ ని క్యాన్సిల్ చేసుకొని హైదరాబాద్ వచ్చేశాడు నాగశౌర్య. ఇక ఈరోజు (శనివారం) మరో యంగ్ హీరో సందీప్ కిషన్ గాయపడ్డారు.

జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా ‘తెనాలి రామకృష్ణ’ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కర్నూలులో జరుగుతోంది. అక్కడ ఓ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. ఈ సందర్భంగా జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ సన్నివేశంలో సందీప్‌ గాయపడ్డారు. వెంటనే యూనిట్‌ సభ్యులు ఆయన్ను కర్నూలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఫైట్‌ మాస్టర్‌ సమన్వయ లోపం కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చిత్ర బృందం తెలిపింది. ప్రాథమిక చికిత్స అనంతరం సందీప్ కిషన్‌ను కర్నూలు నుంచి హైదరాబాద్ తరలించారు. వరుణ్ తేజ్, నాని, నాగశౌర్య ల కంటే ముందు స్టార్ హీరోలు రామ్ చరణ్, ఎన్ టీఆర్ లు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో గాయపడిన సంగతి తెలిసిందే. ఈ యేడాది టాలీవు హీరోలని గాయలు వెంటాడం విచారకరం. బహుశా.. ఏదైనా శాంతి చేయాలేమో.. !