ఒత్తిడిని తగ్గించిన విరాట్


రేపు జరగబోయే భారత్‌×పాక్‌ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ పై ఒరకమైన ఉత్కంఠ నెలకొంది. ఆ హైప్ ని టీమిండియా కెప్టెన్ లైట్ తీసుకొన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆటగాళ్లు, ప్రేక్షకులపై ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేశారు. ఇంతకీ విరాట్ ఏమన్నాడంటే ?

“ఆట కచ్చితమైన ఒక సమయంలో మొదలవుతుంది. ఒక సమయంలో ముగుస్తుంది. మా ప్రదర్శన బాగున్నా బాగాలేకున్నా జీవితానికిదేమీ అంతం కాదు! మ్యాచ్‌లో మేం బాగా ఆడినా ఆడకున్నా దీంతో ఏమీ ముగిసిపోదు. టోర్నీ సుదీర్ఘంగా సాగుతుంది. మా దృష్టి భారీ లక్ష్యంపై ఉంది. ఎవరూ ఒత్తిడి తీసుకోవడం లేదు. పదకొండు మంది ఈ బాధ్యత తీసుకుంటారు. వాతావరణం మా చేతుల్లో ఉండదు. ఎంతసేపు వీలైతే అంత సమయం ఆడతాం. దేనికైనా మేం మానసికంగా సిద్ధంగానే ఉన్నాం” అన్నారు విరాట్.