శర్వానంద్’కు ఇవాళ ఆపరేషన్
యువ హీరో శర్వానంద్ సినిమా షూటింగ్ లో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. పారా గ్లయిడింగ్ కారణంగా తీవ్రంగా గాయపడిన శర్వానంద్ పెయిన్ ను భరించలేకపోతున్నాడని తెలిసింది. దీంతో ఆయనకు కొన్ని మందులు, చిన్న చికిత్స ఒకటి చేశారు. ఇవాళ శర్వానంద్ కు శస్త్ర చికిత్స జరుగుతుంది. డాక్టర్ గురవారెడ్డి ఈ ఆపరేషన్ ను చేయబోతున్నారు. ఈ ఆపరేషన్ తర్వాత శర్వా దాదాపు రెండునెలలు ఇంటికే పరితిమం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన సినిమాలకి బ్రేక్ పడనుంది.
ప్రస్తుతం శర్వానంద్ ’96’ తెలుగు రిమేక్ లో నటిస్తున్నారు. ఇందులో శర్వాకి జంటగా సమంత నటిస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా పనులన్నీ రెండు నెలలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వా సినిమా షూటింగ్ పూర్తయింది. డబ్బింగ్ కూడా అయిపోయింది. కేవలం ప్రమోషన్ మాత్రమే జరగాల్సి వుంది. ఇవీగాక తమిళ-తెలుగు భాషా చిత్రం ఒకటి ఓకె చేసారు. అది ఇంకా ప్రారంభం కాలేదు. ఇప్పుడీ ఈ సినిమాలన్నింటికీ రెండు నెలల పాటు బ్రేక్ పడనుంది.