చలాకీ చంటికి గాయాలు


జబర్థస్త్ కమెడియన్ చలాకీ చంటి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. మంగళవారం ఉదయం చంటి కారులో హైదరాబాద్‌ నుంచి విజయవాడ బయల్దేరారు. సూర్యాపేట జిల్లా కోదాడ సమీపంలో రాగానే చంటి ప్రయాణిస్తున్న కారు వెనుక నుంచి లారీని ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో చంటికి స్వల్పగాయాలయ్యాయి. కారు ముందు భాగం ధ్వంసమైంది. కోదాడ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న చంటి అనంతరం హైదరాబాద్‌కు బయల్దేరారు. జబర్దస్త్‌ కామెడీ షోలో చలాకీ చంటి మంచి కమెడియన్‌గా గుర్తింపు పొందారు. సినిమాల్లోనూ చంటి బిజీ ఆర్టిస్టుగా మారాడు. ఇటీవల కాలంలో టాలీవుడ్ నటులు వరుసగా రోడ్డు ప్రమాదానికు గురవుతుండటం విచారకరం.