తేజు కోసం రాశీ రేటు తగ్గించిందా ?

సీనియర్ హీరోలకే కాదు యంగ్ హీరోలకి హీరోయిన్ సెట్ అవ్వడం కష్టంగానే మారింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న అఖిల్ సినిమా కోసం ఇంకా హీరోయిన్ సెట్ కాలేదు. ఈ సినిమా కోసం కాస్త ఎక్సీపీయన్స్ ఉన్న హీరోయిన్ కోసం చూస్తున్నారు. మెగా యంగ్ హీరో సాయిధరమ్ పరిస్థితి అంతే. మారుతి దర్శకత్వంలో తేజు సినిమా కోసం ఇంకా హీరోయిన్ సెట్ కాలె. ముందుగా ‘ఎబిసిడి’ సినిమా హీరోయిన్ రుష్కర్ థిల్లాన్ ని అనుకొన్నారు. ఆమె దాదాపు ఫైనల్ అయింది.

కానీ, కాస్త నోటెడ్ హీరోయిన్ వుంటే బెటర్ అని ఆది నుంచీ సలహాలు వినిపిస్తూనే వున్నాయి. ఎందుకంటే సాయిధరమ్ తేజ్ మార్కెట్ అంతంతమాత్రం. దానికితోడు నోటెడ్ హీరోయిన్ లేకుంటే, భారం అంతా డైరక్టర్ మారుతి మీదే పడుతుంది. ఈ నేపథ్యంలో రాశీఖన్నా పేరు తెరపైకి వచ్చింది. ఆమెతో చర్చలు జరుపుతున్నారు. రాశీ కావాలంటే రూ. 75లక్షల వరకు చెల్లించాల్సిందే. తేజు కోసం ఏమైనా తగ్గిస్తే.. మరోసారి సుప్రీమ్ జోడి కుదిరినట్టే.