బిగ్ బాస్3పై నాగబాబు రియాక్షన్

బిగ్ బాస్ తెలుగు సీజన్3 త్వరలో ప్రారంభం కానుంది. హోస్ట్ గా కింగ్ నాగార్జున ఫిక్సయినట్టు తెలిసింది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవల విడుదల చేసిన ప్రోమోలోనూ హోస్ట్ గా నాగ్ పేరుని ప్రస్తావించలేదు. ఆ విషయంలో సస్పెన్స్ ని మెయిటైన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా బ్రదర్ నాగబాబు బిగ్ బాస్3హోస్ట్ పోస్ట్ పై స్పందించారు. ఆయన యూట్యూబ్ ఛానల్ ‘నా ఛానల్ నా ఇష్టం’లో బిగ్ బాస్3హోస్ట్ పై ఓ పోల్ నిర్వహించారు. వెంకటేష్, నాగార్జున, నాని, జూ ఎన్టీఆర్, స్టార్ హీరోయన్ అనే ఆప్షన్లు ఇచ్చాడు. ఈ పోల్ లో షాకింగ్ రిజల్ట్ వచ్చింది. ఎక్కువ మంది నాగ్ ని కోరుకొంటున్నారు.

నాగార్జునకు 37 శాతం ఓట్లు, వెంకికీ 36 శాతం ఓట్లు పడ్డాయి. తారక్ కు 16 శాతం, నానికి 3 శాతం, స్టార్ హీరోయిన్ అనే ఆప్షన్‌కు 8 శాతం ఓట్లు పడ్డాయి. ఈ పోల్ పై తారక్ అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 1ని తారక్ అద్భుతంగా నడిపించారు. షోని తీసుకెళ్లి ఓ రేంజ్ లో ఉంచారు. అలాంటిది తారక్ 16శాతం ఓట్లు మాత్రమే రావడమేంటీ ? అని ప్రశ్నిస్తున్నారు. ఇక, నాగబాబు ఇచ్చిన స్టార్ హీరోయిన్ ఆప్షన్ ఏ హీరోయిన్ ని ఉద్దేశించి ఇచ్చారనే విషయంలో క్లారిటీ లేదు. మొత్తంగా బిగ్ బాస్ 3 పై నాగబాబు రియాక్షన్ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.