అఫిషీయల్ : ప్రపంచకప్ నుంచి ధావన్ అవుట్


టీమిండియాకు బ్యాడ్ న్యూస్. గాయం నుంచి ఓపెనర్ శిఖర్ ధావన్ కోలుకోలేదు. దీంతో ఆయన వరల్ కప్ కు దూరం కానున్నాడు. జూన్ 9న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ 117 పరుగులతో సత్తా చాటాడు. కానీ, ఈ మ్యాచ్ లో ప్యాట్ కమిన్స్ బౌలింగ్‌లో ధావన్ ఎడమ చేతి బొటన వేలికి గాయమైంది. తర్వాత అది హెయిర్‌లైన్ ఫ్రాక్చర్ అని తేలింది. ఐతే, 10-12 రోజుల
తర్వాత ధావన్ గాయం నుంచి కోలుకుంటున్న విధానాన్ని సమీక్షించి తుది నిర్ణయం తీసుకొంటామని తెలిపారు.

బుధవారం ధావన్ ని పరీక్షించారు. గాయం ఇంకా మానలేదు. ఆయనకు జులై రెండోవారం వరకు విశ్రాంతి అవసరమని స్పెషలిస్ట్ డాక్టర్లు చెప్పినట్టు టీమిండియా మేనేజ్ మెంట్ తెలిపింది. ఈ నేపథ్యంలో ధావన్ వరల్డ్ కప్ నుంచి తప్పికుంటున్నట్టు తెలిపారు. ఇక, ధావన్ స్థానంలో రిషభ్ పంత్ ని ఇప్పటికే ఇంగ్లాండ్ కు రప్పించారు. మిగితా మ్యాచ్ లలో ధావన్ స్థానంలో పంత్ ఆడబోతున్నారు.