భాజాపాలో రాజగోపాల్‌రెడ్డికి కీలక పదవి
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బుధవారం మునుగోడుకు చెందిన ముఖ్య నాయకులతో ఆయన భేటీ అయ్యారు. కాంగ్రెస్‌ను వీడటంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగానే కొనసాగుతానని.. భాజపాలో కీలక పదవి వస్తుందని వారికి భరోసా ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డికి బాజాపా ఆఫర్ చేసిన కీలక పదవి ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు, రాజగోపాల్‌రెడ్డికి పీసీసీ క్రమశిక్షణాసంఘం షోకాజు నోటీసు జారీ చేసింది. పార్టీ వ్యతిరేక చర్యలతోపాటు దుడుకుగా వ్యవహరించడం లాంటి చర్యలకు పాల్పడినందుకు జారీ చేసిన షోకాజు నోటీసుకు పది రోజుల్లో వివరణ ఇవ్వాలని లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు అందులో స్పష్టం చేశారు. ఐతే, షోకాజు నోటీసుపై స్పందించి ఉద్దేశం రాజగోపాల్ రెడ్దికి లేదు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ వీడి.. భాజాపాలో చేరడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.