‘మల్లేశం’ ట్విట్టర్ రివ్యూ

తెలంగాణ చేనేత కార్మికుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మల్లేశం జీవిత కథగా తెరకెక్కిన చిత్రం ‘మల్లేశం’. ఈ చిత్రానికి రాజ్‌ ఆర్‌ దర్శకత్వం వహించారు. మార్క్‌ కే రోబిన్‌ సంగీతం అందించారు. ఝాన్సీ, అనన్య ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలకి ముందే పలువురి ప్రశంసలు అందుకొన్న ‘మల్లేశం’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇప్పటికే ఉదయం పూట ఆటపడిపోయింది. పబ్లిక్ టాక్ బయటికొచ్చింది.

చాలా నిజాయితీతో తీసిన సినిమా ఇది. మల్లేశం జీవితం ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. 6వ తరగతి వరకు మాత్రమే చదువుకొని.. ఆ తర్వాత నేరుగా పదో తరగతి పరీక్షలు రాసిన మల్లేశం.. తల్లి పడే కష్టాన్ని చూసి ఆసు యంత్రాన్ని కనిపెట్టాడు. ఈ క్రమంలో ఆయన పడిన తపన, కష్టాలు.. తెరపై అద్భుతంగా చూపించాడు. మల్లేశం జీవితాన్ని మాత్రమే కాదు. తెలంగాణ యాస, బాష, సంస్కృతిని తెరపై ఆవిష్కరించాడు. కమర్షియల్ హంగుల కోసం పాకులాడుకుండా.. నిజాయితీగా సినిమా తీశాడని నెటిజన్స్ ట్విట్ చేస్తున్నారు.