త్రివిక్రమ్-బన్నీ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ ?


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలు చేయాలని ఆయన అభిమానులు కోరుకొంటున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ ఘోర పరాజాయాన్ని చవి చూసింది. కేవలం ఒక్క స్థానాన్ని మాత్రమే గెలుచుకొంది. 151స్థానాల్లో వైకాపా ఘన విజయం సాధించి ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో పవన్ పొలిటికల్ గా బిజీగా ఉండే పరిస్థితి లేదు. తిరిగి ఆయన సినిమాలు చేస్తాడని, చేస్తే బాగుంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐతే, పవన్ కి మాత్రం మళ్లీ సినిమాలు చేసే ఉద్దేశం లేదని టాక్.

ఈ ఊహాగానాలు కొనసాగుతుండగానే పవన్ షాక్ ఇచ్చాడు. ఎన్నికల ప్రచారంలో గడ్డెం పెంచి, పంచె కట్టీ.. అచ్చం రాజకీయ నేతగా మారిపోయిన పవన్.. తాజాగా కొత్త లుక్ లోకి వచ్చేశాడు. జీన్స్, కలర్ ఫుల్ షర్ట్ వేశాడు. గడ్డెం ట్రిమ్ చేశాడు. త్రివిక్రమ్ సినిమా కోసం బన్నీ మారిన లుక్ లోకి పవన్ కూడా మారాడు. ఈ నేపథ్యంలోనే త్రివిక్రమ్-బన్నీ సినిమాలో పవన్ గెస్ట్ రోల్ లో మెరుస్తాడా ? అనే అనుమానాలు కలుగుతున్నాయి. లుక్ సేమ్ ఉందని కాదు. కానీ, త్రివిక్రమ్ అడిగితే పవన్ కాదనడు కదా.. ! అందుకే బన్నీ సినిమాలో పవన్ కనిపిస్తాడేమోనని చిన్ని ఆశ కలుగుతోంది. అది జరిగితే.. చాన్నాళ్లుగా పవన్-బన్నీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న గొడవలకి పులిస్టాప్ పెట్టొచ్చు.