టాలీవుడ్ స్టార్స్ పై హరీష్ రావు అభిమానులు ఫైర్

మాజీ మంత్రి హరీష్ రావు అభిమానులు టాలీవుడ్ స్టార్స్ ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హరీష్ రావుని ఆహ్వానించకపోవడంపై ఆయన అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని సోషల్ మీడియా వేదిగా గట్టిగానే ప్రశ్నిస్తున్నారు.

హరీష్ రావు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కాళేశ్వరం దాదాపు పూర్తయింది. అలాంటి హరీష్ రావుని పిలవకుండా సమైక్యవాదిగా అప్పట్లో కాళేశ్వరం ప్రాజెక్టుని అడ్డుకోవాలని చూసిన ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ని చీఫ్ గెస్ట్ గా పిలవడం తెలంగాణ, హరీష్ అభిమానులకి నచ్చలేదు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా కేసీఆర్ ప్రభుత్వాన్ని తగులుకొంటున్నారు.

సీఎం కేసీఆర్ మాత్రమే కాదు టాలీవుడ్ స్టార్స్ కూడా హరీష్ రావుని నెగ్లెక్ట్ చేసినట్టు అనిపించింది. శుక్రవారం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా టాలీవుడ్ స్టార్స్ నాగార్జున, రవితేజ, మహేష్ బాబు ట్విట్ చేశారు. ఇదొక ఇంజినీరింగ్ అద్భుతమంటూ కొనియాడారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ లపై ప్రశంసలు కురిపించారు. ఐతే, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు పేరుని ప్రస్తావించలేదు. ఈ నేపథ్యంలో హరీష్ అభిమానులు నాగ్, రవితేజ, మహేష్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం విషయంలో కేసీఆర్, కేటీఆర్ గ్రేట్ కాదు.. హరీష్ రావు గ్రేట్. ఆయనకీ క్రెడిట్ దక్కాలని కామెంట్స్ చేస్తున్నారు. అదీ.. నిజమే మరీ !