‘కబీర్ సింగ్’ ఫస్ట్ డే లెక్కెంత ?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్ అర్జున్ రెడ్డి బాలీవుడ్ రిమేక్ కబీర్ సింగ్. మాతృక దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వం వహించారు. షాహిద్ కపూర్,కియారా అద్వానీ జంటగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘కబీర్ సింగ్’ హిట్ టాక్ ని సొంతం చేసుకొన్నాడు. అర్జున్ రెడ్డి మాదిరిగా సంచలన విజయం నమోదు చేసేలా కనిపిస్తున్నాడు. తొలిరోజు రూ. 20కోట్లు కలెక్ట్ చేసింది.

ఈ యేడాది అత్యధిక తొలిరోజు కలెక్షన్స్ సాధించిన రెండో చిత్రం కబీర్ సింగ్ రికార్డు సృష్టించాడు. సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన ‘పద్మావతి’ తొలిరోజు రూ. 18.21కోట్లు కలెక్ట్ చేసింది. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్, దీపికా పదుకొనె, షాహిద్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన పద్మావతి సూపర్ హిట్ అయింది. ఇప్పుడీ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ని మన అర్జున్ రెడ్డి రిమేక్ కబీర్ సింగ్ క్రాస్ చేయడం విశేషం. అర్జున్ రెడ్డి కథకి బాలీవుడ్ జనాలు కూడా ఫిదా అయ్యారు అన్నమాట.