‘వాల్మీకి’ టీజర్’కు ముహూర్తం ఫిక్స్

హరీష్ శంకర్ దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళ్ హిట్ ‘జిగర్తాండా’కి రిమేక్ ఇది. ఇందులో వరుణ్ తేజ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇందుకోసం ఆయన కొత్త లుక్ లోకి మారిపోయాడు. గడ్డెం పెంచారు. బాక్సింగ్ కూడా నేర్చుకొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా జెడ్ స్వీడుతో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవలే యాగంటి, బెంగుళూరు పరిసర ప్రాంతాలలో షూటింగ్ నిర్వహించారు. సెప్టెంబర్ 6న వాల్మీకిని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తాజా వాల్మీకి టీజర్ విడుదలకి ముహూర్తం ఫిక్స్ చేశారు. సోమవారం (జూన్ 24)న టీజర్ ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలింది. ఈ పోస్టర్ ని వైవిధ్యంగా డిజైన్ చేశారు. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. గతంలో వీరిద్దరు కలిసి ‘ముకుందా’ చిత్రంలో నటించారు. వరుణ్ తేజ్ తొలి సినిమా అది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తున్నారు.