వైరల్ : కాస్ట్లీ పెళ్లిలో కత్రినా డ్యాన్స్

సినిమాలకి సంబంధించిన ఈవెంట్స్ లోనే స్టార్ హీరోయిన్స్ చిందేయడం చూస్తుంటాం. పైసల్ ఎక్కువిస్తే.. బయటికి ఫంక్షన్స్ లో డ్యాన్స్ చేసే అలవాటు కత్రినా కైఫ్ కు ఉంది. తాజాగా ఆమె ఓ కాస్ట్లీ పెళ్లి వేడుకలో చిందేసింది. డెహ్రాడూన్‌ లోని ఔలీ ప్రాంతానికి చెందిన ఓ కుటుంబం ఏకంగా రూ.200 కోట్లు ఖర్చు పెట్టి వివాహ వేడుకను ఏర్పాటు చేసింది. ఈ వేడుకలో డాన్స్ చేసేందుకు కత్రినాకి భారీ పారితోషికం ఆఫర్ చేసింది. అందుకు ఓకే చెప్పిన కత్రినా పెళ్లి వేడుకలో అదరగొట్టేసింది.

‘తీస్ మార్ ఖాన్’ సినిమాలో ‘షీలా కీ జవానీ’ పాటకు కత్రినా డాన్స్ చేసింది. వధూవరులతోనూ డ్యాన్స్ చేయించింది. దానికి సంబంధించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కత్రినాతో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రేటీలు ఈ పెళ్లి వేడుకలో మెరిశారు. బుల్లితెర నటి సురేభీ జ్యోతి కూడా డాన్స్ చేసింది. ఈ కాస్ట్లీ పెళ్లి వేడుకలో డ్యాన్స్ చేసినందుకు కత్రినాకు ఓ సినిమాలో నటిస్తే వచ్చేంత రెమ్యూనరేషన్ వచ్చినట్టు తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ – కత్రినా జంటగా నటించిన భారత్ రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం కత్రినా అక్షయ్ కుమార్ జంటగా ‘సూర్యవంశీ’ సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, పర్సనల్ విషయానికొస్తే కత్రినా ప్రస్తుతం సింగిల్. మొదట సల్మాన్ ఖాన్ తో ఆ తర్వాత రణ్ బీర్ కపూర్ తో కత్రినా డేటింగ్ చేసింది.