‘ఆర్ఆర్ఆర్’ కోసం మెగాస్టార్ సాయం

‘ఆర్ఆర్ఆర్’ కోసం రామ్ చరణ్ తండ్రి, మెగాస్టార్ చిరంజీవి సాయం తీసుకోక తప్పడం లేదు. చరణ్ హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగా బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ‘ధృవ’ సినిమాలో నటిస్తూనే మెగాస్టార్ చిరంజీవి ‘ఖైదీ నెం.150’ నిర్మాణ బాధ్యతలని నిర్వహించారు. ఆ సమయంలో చరణ్ ని దర్శకుడు వివి వినాయక్ సాయం చేశాడు. ఖైదీ నెం.150నిర్మాణ బాధ్యతలు చాలా వరకు వినాయక్ నే చూసుకొన్నారు. ఇప్పుడు ‘సైరా’ విషయంలోనూ రామ్ చరణ్ మరొకరి సాయం అవసరమైంది.

సైరా షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఐతే, రామ్ చరణ్ త్వరలోనే ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీ కాబోతున్నాడు. హైదరాబాద్ షెడ్యూల్ పూర్తికాగానే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం మహారాష్ట్ర, అహ్మదాబాద్ వెళ్లనుంది. అక్కడ నాన్ స్టాప్ గా షూటింగ్ ని ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో చరణ్ కి హైదరాబాద్ రావడం సైరా నిర్మాణ పనులు చూసుకోవడం కుదరదు. ఈ నేపథ్యంలో ‘సైరా’ నిర్మాణ బాధ్యతలని చిరుపై పెట్టాడట. ఆయనకి బాబాయ్ నాగబాబు కూడా తోడుంటాడని తెలిసింది.