ప్రైవేటు కూడా అమ్మఒడి


వైకాపా ప్రభుత్వం నవరత్నాల్లో భాగంగా ప్రవేశపెట్టిన ‘అమ్మఒడి’ పథకంపై ఎట్టకేలకు స్పష్టత వచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ పథకం విధివిధానాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన జారీ చేసింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలకి అమ్మఒడి వర్థిస్తుందని ప్రకటనలో తెలిపింది.

‘‘అక్షరాస్యత పెంచడమే అమ్మఒడి పథకం లక్ష్యం. ప్రతి పేద విద్యార్థి తల్లికి అమ్మఒడి పథకం కింద రూ.15వేలు ఇస్తామని నవరత్నాల్లో సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు అమ్మఒడి పథకం వర్తిస్తుంది. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం’’ అని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.