సోష‌ల్ మీడియాను నియంత్రించే అధికారం లేదా?

సోష‌ల్ మీడియాపై శాస‌న‌మండ‌లిలో చ‌ర్చ జ‌రిగింది. రోజురోజుకు విస్తృత‌మ‌వుతున్న సోష‌ల్ మీడియాపై ఏం చేయాల‌నేదానిపై సభ్యులు ర‌క‌ర‌కాల వాద‌న‌లు వినిపించారు. చాలా సామాజిక మాధ్యమాలు ఎటువంటి అనుమ‌తులు లేకుండా న‌డుస్తున్నాయ‌ని, ప్రధానమంత్రి నుంచి, వార్డ్ మెంబర్ దాకా అందరిని ఇష్టమోచ్చిన రీతిలో విమర్శిస్తున్నారని కొంద‌రు స‌భ్యులు ఆరోపించారు. అస‌భ్య‌క‌ర‌మైన ఫోటోల‌ను నియంత్రించాల‌ని విన్న‌వించారు.

అయితే కొంత‌మంది స‌భ్యులు మాత్రం సోషల్ మీడియాతో న‌ష్టాల‌తోపాటు లాభాలు కూడా ఉన్నాయ‌ని వాద‌న‌లు వినిపించారు. కొద్ది రోజుల క్రితం ఓక స్కూల్ పిల్లాడు రోడ్డు పై ధీనంగా పడి ఉన్న ముసలావిడను చూసి చలించి పోయి ఆ ముసలావిడ ధీన స్థితిని కేటీఆర్ కు ట్విట్ చేసాడని, తరువాత ముసలావిడను ఓల్డేజ్ హోం కు తరలించిన విష‌యాన్ని స‌భ‌లో గుర్తు చేశారు. టీనేజీ పిల్ల‌ల‌ను దృష్టిలో పెట్టుకొని కొంత మేర సోష‌ల్ మీడియాను నియంత్రించాల‌ని చెప్పారు.

ఎవ‌రు ఎలాంటి వాద‌న‌లు వినిపించినా సోషల్ మీడియా ను నియంత్రించే అధికారం లేదని స‌భ‌లో మంత్రి తుమ్మ‌ల తేల్చి చెప్పేశార‌ట‌. గతంలో సెక్షన్46ప్రకారం నియంత్రించే అధికారం ఉందేద‌ని, కానీ ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ వల్ల సోషల్ మీడియా ను నియంత్రించలేమని చెప్పార‌ట‌. అయితే సోష‌ల్ మీడియా నియంత్ర‌ణ చ‌ట్టం సాధ్యాసాధ్యాల‌పై చ‌ర్చిస్తామ‌ని అన్నారు మంత్రి తుమ్మ‌ల‌.