ఒకే హీరోయిన్’ని వాడుకొంటున్న తండ్రీ-కొడుకులు
మెగా కాపౌండ్ లో అడుగుపెట్టిన హీరోయిన్ పంట పండినట్టే. వరుసగా మెగా హీరోలతో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేయొచ్చు. త్వరగా స్టార్ హీరోయిన్ గా ఎదగవచ్చు. తమన్నా, కాజల్, రకుల్ ప్రీత్ సింగ్.. ఇలా ఎదిగినవారే. ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ కూడా ఇదే ఫార్ములాని ఫాలో అవుతున్నట్టు కనబడుతోంది. నాగ చైతన్య ‘సవ్యసాచి’ హీరోయిన్ నిధి అగర్వాత్ తో.. ఆ వెంటనే అఖిల్ మిస్టర్ మజ్ను రొమాన్స్ చేశాడు. ఇప్పుడు తండ్రి, కింగ్ నాగార్జున హీరోయిన్ తో చైతూ రొమాన్స్ చేయబోటున్నట్టు సమాచారమ్.
‘సోగ్గాడే చిన్నినాయనా’కి కొనసాగింపుగా ‘బంగార్రాజు’ తెరకెక్కబోతోంది. త్వరలోనే ఆ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి చిత్రాన్ని తెరకెక్కించిన కల్యాణ్‌కృష్ణ దర్శకుడు. ఇందులో నాగ్ మనవడిగా నాగ చైతన్య నటిస్తున్నారు. ఆయనకి జంటగా కీర్తి సురేష్ ని తీసుకొన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి మన్మథుడు2లో నాగ్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తండ్రి తర్వాత తనయుడు చైతూతో కీర్తి సురేష్ జతకట్టనుండటం హాట్ టాపిక్ గా మారింది.