‘హలో’ టీజర్ అదిరింది !

అఖిల్ అక్కినేని టీజర్’తో హలో చెప్పేశాడు. ఆయన హీరోగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “హలో”. అఖిల్ సరసన కల్యాణి జతకట్టింది. కొద్దిసేపటి క్రితమే హలో టీజర్’ని రిలీజ్ చేశారు. “ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ ఇన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా, ఏం అడ్డు వచ్చినా, తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు.” అంటూ నాగార్జున వాయిస్‌ ఓవర్‌తో టీజ‌ర్‌ ప్రారంభమైంది. టీజర్ లో యాక్షన్ సీన్స్ హైలైట్ గా కనిపిస్తున్నాయి. టీజర్’లో దర్శకుడు విక్రమ్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన గత చిత్రాలు మనం, 24 తరహా హలో టీజర్ ఉంది.

సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ, జగపతి బాబులని టీజర్ లోనూ షాట్ లో చూపించారు. సింగిల్ డైలాగ్ లేకుండా యాక్షన్, ఎమోషన్ క్యారీ చేస్తూ కేవలం నాగార్జున వాయిస్ ఓవర్ తో టీజర్ ని కట్ చేసిన విధానం అదిరింది. ఈ యాక్షన్‌ లవ్‌ స్టోరీ నిజంగానే అదిరిపోయేలా ఉండేలా కనిపిస్తోంది. అది చూడ్డానికి డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే. ఆరోజే అఖిల్ థియేటర్స్ లో హలో చెప్పబోతున్నాడు.

ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్. నాగార్జున నిర్మాత.