ఆ బ్యాచ్ లో పూజా కూడా


బాలీవుడ్ కు వెళ్లి చేతులు కాల్చుకున్న టాలీవుడ్ ముద్దుగుమ్మల బ్యాచ్ పెద్దది. ఇలియానా, తమన్న, అసిన్, శ్రియ, జెనీలియా, శృతిహాసన్.. బాలీవుడ్ ని ఏలుదామని పోయి.. ఎటూ కాకుండా పోయారు. ఇప్పుడీ బ్యాచ్ లో స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా చేరింది. పూజాహెగ్డేకు బాలీవుడ్ కొత్తమీ కాదు. అక్కడ ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకున్న తర్వాతే సౌత్ కు వచ్చింది.

ఇక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ప్రస్తుతం పూజా కోసం స్టార్ హీరోలు క్యూలో నిలబడే పరిస్థితి. ఇలాంటి స్టేటస్ ను ఎంజాయ్ చేయకుండా మరో హిందీ ఆఫర్ వచ్చిందంటూ బాలీవుడ్ కి వెళుతోంది పూజా. అది కూడా స్టార్ హీరో ఆఫర్ కాదు. అది ఓ బి-గ్రేడ్ సినిమా. బాలీవుడ్ అనేది ఓ స్టేటస్. బాలీవుడ్ హీరోయిన్ అనే ముద్ర వేయించుకుంటే ఆ కిక్కే వేరు. జాతీయస్థాయిలో ఓ వెలుగు వెలిగిపోవచ్చు. ఆ కిక్కు కోసం వెళ్లి టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు కెరీర్ ని నాశనం చేసుకొంటున్నారు. ఇప్పుడు పూజా రిస్క్ చేస్తుందన్నది క్రిటిక్స్ టాక్.