ప్రజావేదిక కూల్చేస్తాం : జగన్

ఏపీలో అక్రమ నిర్మాణాలని కూల్చేయాలని ముఖ్యమంత్రి సీఎం జగన్ అధికారులని ఆదేశించారు. ఎల్లుండి (జూన్ 26) నుంచి అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టాలని ఆదేశించారు. ఉండవల్లి ప్రజావేదిక అక్రమ నిర్మాణమే.. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజావేదిక నుంచే ప్రారంభించాలని సూచించాడు. నిబంధనలకు విరుద్ధంగా ప్రజావేదిక కట్టారంటూ సీఆర్‌డీఏ నివేదిక ఇచ్చిందన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రజా దర్బార్ నుంచే మొదలెట్టాలని ఆదేశించారు.

సోమవారం ఉండవల్లి ప్రజావేదికలో కలెక్టర్ల సదస్సులో సీఎం జగన్‌ పాల్గొన్నారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టాలన్నారు. నవరత్నాలే మన మేనిఫెస్టో అన్నది గుర్తుంచుకోవాలి. మేనిఫెస్టోను ఒక భగవద్గీత, ఖురాన్‌, బైబిల్‌గా భావించాలి. ప్రజలు ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకొన్నారు. అందరం సమష్టిగా పనిచేస్తేనే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయగలుగుతాం. వచ్చే ఎన్నికల నాటికి మేనిఫెస్టోను పూర్తి చేశామని చెప్పగలగాలన్నారు సీఎం జగన్. ‘నేను చనిపోయినా ప్రతి ఇంట్లో నా ఫోటో ఉండాలి. ఇదే నా ఆశయం’ అన్నారు సీఎం జగన్.