జగన్ సంచలన నిర్ణయం
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకొన్నారు. ఉండవల్లి ప్రజావేదికలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో అధికారులకి కీలక ఆదేశాలు జారీ చేశారు. ట్రాన్సఫరన్స్, అండ్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉండాలి. చిరునవ్వుతో ఉండండి అదే మంచి జరుగుతుందన్నారు. ప్రతి సోమవారం ‘స్పందన’ పేరుతో పిర్యాదులను స్వీకరించండి. ఫిర్యాదు తీసుకోగానే రసీదు ఇవ్వండి. ఫోన్ నెంబర్ తీసుకోండి. గడువు కూడా ఇవ్వండి. సమస్యని పరిష్కరించండని ఆదేశాలించారు.
అంతేకాదు.. కలెక్టర్లు వారానికోసారి హాస్టల్, పిహెచ్ సి, స్కూళ్లను సందర్శించాలి. ఒక రోజు అక్కడే నిద్ర చేయాలి. తెల్లారి ప్రజలతో మమేకమవ్వాలని ఆదేశించారు. మీరు బస చేసిన ప్రాంతంలో ఇప్పుడు, అప్పుడు ఫోటోలు చూపండన్నారు సీఎం జగన్. జగన్ చెప్పినట్టు అధికారులు చేస్తే.. ప్రభుత్వం పాఠశాలలు, హాసుపత్రులు, హాస్టల్స్ తలరాతలు మారడం ఖాయమని చెప్పవచ్చు. ఇక, అవినీతి కట్టడాలని ఈ నెల 26నుంచి కూల్ఛేయాలని సీఎం ఆదేశించారు. నిబంధనలకి విరుద్ధంగా నిర్మించిన ప్రజా దర్భార్ నుంచే కూల్చివేతలు ప్రారంభించాలని సూచించారు.