వాట్సాప్‌’లో సరికొత్త ఫీచర్

వాట్సాప్’లో సరికొత్త ఫీచర్ అందుబాటులోనికి రానుంది. వాట్సాప్‌ ప్రవేశపెట్టిన ‘డిలీట్‌ ఎవ్రీవన్‌’ ఫీచర్‌ ద్వారా మనం అవతలి వ్యక్తికి పంపిన సందేశాన్ని ఏడు నిమిషాల్లోపు తొలగించవచ్చు. దీనికి స్పానిష్‌ ఆండ్రాయిడ్‌ బ్లాగ్‌ ఆండ్రాయిడ్‌ జెఫీ ప్రత్యామ్నాయం కనుగొంది. తొలగించిన సందేశాలను వాటిని అందుకున్న వ్యక్తి తిరిగి పొందవచ్చును.

ఆండ్రాయిడ్‌ 7.0 నౌగట్‌ లేదా హైవెర్షన్‌లోని యాప్‌ ద్వారా మెసేజ్‌ పంపిన వ్యక్తి తొలగించిన సందేశాలను తిరిగి పొందవచ్చని పేర్కొంది. ఈ యాప్‌ ద్వారా కేవలం టెక్ట్స్‌ సందేశాలను మాత్రమే పొందగలం. ఫొటోలు, వీడియోలు, ఇతర సమాచారాన్ని పొందలేం. ఈ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అయితే యాప్‌ ద్వారా తొలగించిన సందేశాలను తిరిగి పొందడానికి కొన్ని పరిమితులను విధించింది. కేవలం 100 అక్షరాలను మాత్రమే కనిపించేలా చేస్తుంది.